Categories: Trending now

Isha Ambani Twins,Isha Ambani: ‘ఎవరూ సిగ్గుపడొద్దు.. నేను ఐవీఎఫ్‌తోనే కవలలకు జన్మనిచ్చా’.. అంబానీ తనయ ఆసక్తికర విషయం – isha ambani says she conceived twins via ivf like mom nita ambani

2024-06-30 15:05:02

IVF: దేశంలోనే అత్యంత సంపన్నుడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ తనయగా.. రిలయన్స్ రిటైల్ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తూ యువ వ్యాపారవేత్తగా పేరొందిన ఈశా అంబానీ పిరమాల్ ఇప్పుడు తన వ్యక్తిగత జీవితం గురించి ఒక ఆసక్తికర విషయం గురించి వివరించారు. ఐవీఎఫ్ పద్ధతిలో తాను కవలలకు జన్మనిచ్చినట్లు తెలిపారు. తాజాగా ఇప్పుడు ఆమె లైఫ్‌స్టైల్, ఫ్యాషన్ మ్యాగజైన్ వోగ్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. IVF పద్ధతిని అంతా సాధారణంగానే భావించాలన్న ఉద్దేశంతోనే ఈ విషయం గురించి వెల్లడిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. దీని గురించి ఎవరూ సిగ్గుపడాల్సిన అవసరం ఏమీ లేదని అన్నారు.

‘నేను ఐవీఎఫ్‌తో పిల్లలకు జన్మను ఇచ్న విషయం గురించి చాలా త్వరగా బయటపెడుతున్నాను. ఈ పద్ధతిని అంతా సాధారణంగానే భావించాలనే ఉద్దేశంతోనే దీనిని వెల్లడిస్తున్నా. ఎవరూ దీని గురించి సిగ్గుపడనక్కర్లేదు. ఈ ఐవీఎఫ్ అనేది చాలా క్లిష్టమైన ప్రక్రియ. ఆ చికిత్స తీసుకుంటున్న సమయంలో శారీరకంగా చాలా అలసిపోతారు. మనకోసం ఆధునిక సాంకేతికత అందుబాటులో ఉంటే.. సంతానం కోసం ఎందుకు దానిని ఉపయోగించుకోకూడదు. ఇది మీరు సంతోషించాల్సిన విషయం. దాచాల్సిన అవసరం లేదు. మీరు ఇతర మహిళలతో దీని గురించి మాట్లాడితే.. ఈ ప్రక్రియ అనేది సులభంగానే అనిపించొచ్చు.’ అని ఈశా అభిప్రాయపడ్డారు.

ఈశా అంబానీకి 2018లో ఆనంద్ పిరమాల్‌తో వివాహం జరగ్గా.. 2022లో ఆద్యశక్తి, కృష్ణ అనే కవలలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అంతకుముందు.. ఈశా తల్లి ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ కూడా ఈశా, ఆకాశ్‌కు జన్మనిచ్చేందుకు ఈ ఐవీఎఫ్ పద్ధతినే ఆశ్రయించారు. గతంలో నీతానే ఒక సందర్భంలో ఈ విషయం గురించి వెల్లడించారు.

‘నేను గర్భం దాల్చలేనని డాక్టర్లు చెప్పిన సమయంలో ఎంతో వేదనకు గురయ్యా. నా వయసు అప్పుడు 23 ఏళ్లు. నా డాక్టర్ స్నేహితురాలు నాకు ఈ బాధను తొలగించింది. IVF వల్లే నేను కవలలకు జన్మనిచ్చా.’ అని తెలిపారు నీతా. ఐవీఎఫ్ క్లిష్ట ప్రక్రియ అయినప్పటికీ.. ఎన్నో జంటల్లో ఇది ఆనందాన్ని నింపుతుందని వైద్య నిపుణులు తెలిపారు. ఈశా ఈ విషయం బయటకు వెల్లడించడం గొప్ప విషయం అని.. ఇదేమీ మచ్చ కాదని అన్నారు.

IVF విధానాన్నే టెస్ట్ ట్యూబ్ బేబీ విధానం అని అంటారు. దీంట్లో ఆడవారి నుంచి పక్వమైన అండాల్ని బయటకు తీసి.. ల్యాబ్‍‌లో ఒక పాత్రలో పెట్టి.. మగవారి వీర్య కణాలతో ఫలదీకరణ చెందిస్తారు. ఈ ప్రాసెస్‌లో ఏర్పడిన మొదటి దశ పిండాల్లో రెండు, మూడింటిని ఆడవారి గర్భంలో ప్రవేశపెట్టేలా చేస్తారు. అక్కడ అవి కుదురుకొని పెరగుతాయి. ఈ పద్ధతిలో నార్మల్‌గా ట్విన్స్‌కు (కవలలు) జన్మనిచ్చే రేటు 10 శాతం ఉంటుంది. మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఐవీఎఫ్ ట్రీట్మెంట్ జరుగుతుంది.

News Today

Recent Posts

Arvind Kejriwal Resignation: ‘There is just one CM of Delhi.…’ says Atishi in her first reaction

AAP minister Atishi on Tuesday addressed the media for the first time after being elected…

5 mins ago

Here’s how far mortgage rates have dropped already this year

2024-09-20 08:15:03 Mortgage rates are a lot lower today than they were at the start…

15 mins ago

Adoption fraud separated generations of South Korean children from their families, AP finds

SEOUL, South Korea -- South Korea’s government, Western countries and adoption agencies worked in tandem…

20 mins ago

Quién fue Emerson Romero, el cineasta que honra Google con un Doodle este 19 de septiembre

2024-09-20 08:05:03 Durante el Mes de la Herencia Hispana, Google ha decidido utilizar sus Doodle…

25 mins ago

State Department opens online passport renewal service to full public

2024-09-20 07:55:03 The days where the only option to renew your passport was mailing the…

35 mins ago