
2024-06-13 22:40:02
కల్కి చిత్రంలో చేజర్ల మండలం పెరుమాళ్లపాడులోని నాగేశ్వర ఆలయాన్ని చిత్రీకరించినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది.
కల్కి చిత్రంలోని నాగేశ్వరస్వామి ఆలయం
చేజర్ల, న్యూస్టుడే: కల్కి చిత్రంలో చేజర్ల మండలం పెరుమాళ్లపాడులోని నాగేశ్వర ఆలయాన్ని చిత్రీకరించినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. 2020లో స్థానిక యువత.. ఇసుకలో కూరుకుపోయిన ఆలయాన్ని వెలికితీశారు. అనంతరం దీన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వం, దేవదాయ, పురావస్తు శాఖలను స్థానికులు కోరారు. పెన్నానదికి అభిముఖంగా ఉన్న ప్రాంతంలో ఆలయం ఉండేది. 200 ఏళ్ల క్రితం ఇసుక తుపాన్ల కారణంగా ఆలయం ఇసుకలో కూరుకుపోయింది. వందల ఎకరాల మాన్యం ఉన్న ఈ ఆలయాన్ని వెలికి తీసి పునరుద్ధరిస్తే పెన్నా తీరంలో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.