2024-06-10 13:15:03
Shivam Dube Catch Drop: పాకిస్థాన్ ఇన్నింగ్స్ మూడో ఓవర్లో మహ్మద్ రిజ్వాన్ క్యాచ్‌ను శివమ్ దూబే జారవిడిచాడు. బుమ్రా వేసిన లెంగ్త్ బంతికి రిజ్వాన్ క్రాస్ ఆడగా, బంతి డీప్ ఫైన్ లెగ్‌లోకి వెళ్లింది. దూబేకి క్యాచ్‌కి అవకాశం లభించినా, చేతుల్లోకి వచ్చిన క్యాచ్‌ని చేజేతులా జారవిడిచాడు. దీంతో ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో తీవ్రంగా కామెంట్లు పెడుతున్నారు. దూబే బదులు అభిషేక్ శర్మను తీసుకుంటే బాగుండేది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ధోని ఆధ్యర్వంలో ట్రైనింగ్ తీసుకుని, ఆయన పేరును చెడుగొడుతున్నావంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
ఐసీఎల్ 2024లో అద్భుతంగా ఆడి, బీసీసీఐ సెలెక్టర్ల మనసు దోచుకున్న దూబే.. టీ20 ప్రపంచకప్ 2024లో చోటు దక్కించుకున్నాడు. మొత్తంగా 14 మ్యాచ్‌లు ఆడిన దూబే.. 396 పరుగులు చేశాడు. అయితే, ఐపీఎల్ మధ్యలోనే భారత జట్టుకు సెలెక్ట్ అయ్యాడు.
Why is Shivam Dube in the team ?
Can’t bat can’t catch can’t bowl
Why in the hell is Virat Kohli opening ? #Viratkohli #ShivamDube #INDvsPAK #PAKvsIND pic.twitter.com/ZFIC0OxLBa
— Iceicebaby (@iceicebabylive) June 9, 2024
అయితే, ఆ తర్వాత ఆడడం మర్చిపోయాడు. తన ఫాం కోల్పోయి ఇబ్బందులు పడ్డాడు. టీ20 ప్రపంచకప్‌లో తన ఫాంను సొంతం చేసుకుంటాడు అని ఆలోచించారు. కానీ, పాక్ మ్యాచ్‌లో అది కూడా లో స్కోరింగ్ మ్యాచ్‌లో డేంజరస్ బ్యాటర్ రిజ్వాన్ ఇచ్చిన క్యాచ్‌ను జారవిడిచాడు. దీంతో ఇకపై భారత జట్టులో చోటు దక్కించుకోవడం కష్టమేనని తెలుస్తోంది.
Think about dube what he done na batting acchi na bowling kar rah he na feilding acchi agar yanha Rinku hota toh match ka roop kuch alag hota #shivamdube #INDvsPAK pic.twitter.com/b4nFsS0M9G
— Bhai_cric_he (@bhai_cric_he) June 9, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..