2024-07-07 16:15:01
MS Dhoni Birthday Celebration Telugu Fans: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) పుట్టినరోజు ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తున్నారు అభిమానులు. అయితే తెలుగు అభిమానుల రూటే వేరు . ధోనీ రేంజ్ ఎలా పెరిగిందో అలా కటౌట్ సైజ్ కూడా పెరగాల్సిందే అనుకున్న పలువురు అభిమానులు కృష్ణా జిల్లా నందిగామ మండలం అంబారుపేట దగ్గరున్న హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి పక్కనే ధోనీ కటౌట్ ఏర్పాటు చేశారు. అయితే ఒకటికాదు రెండుకాదు ఏకంగా 100 అడుగుల కటౌట్‌ను అభిమానులు ఏర్పాటు చేశారు. . దీని ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ప్రతి సంవత్సరం ఇదే ప్లేస్ లో ధోనీ కటౌట్‌ను ఏర్పాటు చేస్తున్నారు అభిమానులు. అయితే గతేడాది 77 అడుగుల కటౌట్ పెట్టగా ఈ సారి 100 అడుగుల కటౌట్‌ను పెట్టినట్టు చెబుతున్నారు. వేడుకల్లో భాగంగా ఒక లక్షా 80 వేల రూపాయలు ఖర్చు పెట్టి 300 మందికి అన్నదానం చేయనున్నారు. బైక్ ర్యాలీ చేశారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.
https://twitter.com/CricCrazyJohns/status/1809468520281042965?ref_src=twsrc%5Etfw” rel=”nofollow
ధోనీ –ఇది పేరు కాదు ఒక ఎమోషన్
1981 జులై 7న జన్మించిన ధోనీ 2004 డిసెంబర్ 23 బంగ్లాదేశ్‌తో జరిగిన భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఏ ముహూర్తంలో అడుగుపెట్టాడో గానీ భారత క్రికెట్ స్వర్ణయుగ కర్తగా మారిపోయాడు. ముందు ఫినిషర్‌గా… తరువాత కెప్టెన్‌గా భారత క్రికెట్ లోనే కాదు అంతర్జాతీయ క్రికెట్‌పై కూడా చెరగని ముద్ర వేశాడు. విశాఖపట్నం వేదికగా పాకిస్థాన్ ను చితగ్గొట్టిన ధోనీ ఆ తరువాత కెరీర్ లో తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. 2007 వన్డే ప్రపంచకప్ తర్వాత టీ 20 ప్రపంచకప్‌కు కెప్టెన్‌గా మారిన మహీ భారత జట్టును విశ్వ విజేతగా నిలిపాడు. తరువాత 2011లో ధోనీ కెప్టెన్సీలో 28 ఏళ్ల తర్వాత భారత్ వన్డే ప్రపంచకప్ గెలుచుకుంది. 2013లో ఛాంపియన్స్‌ని గెలిచి భారత్‌కు మరో ఐసీసీ ట్రోఫీ అందించాడు.
ఇలా మొత్తం మూడు ఐసీసీ ట్రోఫీలను గెలిచిన ఏకైక భారత కెప్టెన్‌గా మహీ నిలిచాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ధోనీ శకం గురించి చెప్పనవసరం లేదు .. మొదటినుంచీ చెన్నై కే ఆడుతున్న ధోనీ కెప్టెన్సీలో CSK ఐదు IPL టైటిళ్లను గెలుచుకుంది. తరువాత 2019 వరల్డ్ కప్ సెమీస్‌లో ధోనీ పెద్దగా మెరుపులు మెరిపించలేదు. తరువాత పెద్దగా ప్రచారం లేకుండా 2020 ఆగస్టు 15న రాత్రి 7.29 గంటలకు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చాడు.
ధోనీ సేవలను గుర్తించిన ప్రభుత్వం 2007 లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, 2009 లో పద్మశ్రీ, 2018లో పద్మభూషణ్ తో సత్కరించింది.
మరిన్ని చూడండి
Kareena Kapoor is working with Raazi director Meghna Gulzar for her next film. The project,…
2024-11-09 15:00:03 WEST LAFAYETTE -- Daniel Jacobsen's second game in Purdue basketball's starting lineup lasted…
2024-11-09 14:50:03 Rashida Jones is remembering her late father, famed music producer Quincy Jones, in…
2024-11-09 14:40:03 A silent German expressionist film about vampires accompanied by Radiohead’s music — what…
Let's face it - life can be downright stressful! With everything moving at breakneck speed,…
Apple’s redesigned Mac Mini M4 has ditched the previous M2 machine’s SSD that was soldered…