2024-07-06 12:35:01
భారత స్టార్ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్‌కు ..సొంతగడ్డపై ఘన స్వాగతం లభించింది. 17 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ కరీబియన్ గడ్డపై కొత్త చరిత్ర లిఖించిన భారత క్రికెటర్లకు అభిమానులు హా రతి పడుతున్నారు.
- విజయోత్సవ ర్యాలీలో జనసందోహం
- పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఫ్యాన్స్
Mohammed Siraj | మెహిదీపట్నం జూలై 5: భారత స్టార్ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్‌కు.. సొంతగడ్డపై ఘన స్వాగతం లభించింది. 17 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ కరీబియన్ గడ్డపై కొత్త చరిత్ర లిఖించిన భారత క్రికెటర్లకు అభిమానులు హా రతి పడుతున్నారు. ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ గెలిచిన టీమ్ ఇండియా ప్లేయర్ అయిన సిరాజ్ శుక్రవారం హైదరాబాద్‌కు చేరుకున్నాడు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకో గానే అభిమానుల సం దోహం మొదలైంది. ఎయిర్పోర్ట్ నుంచి బయల్దేరిన ఈ యు వ పేసర్‌కు అడుగడుగునా ఫ్యాన్స్ బ్ర హ్మరథం పట్టారు. మెహదీపట్నం సరోజినిదేవి దవాఖాన నుంచి మొదలైన విజయోత్సవ ర్యాలీ ఉద్గా మైదానం వరకు సాగింది.
జాతీయ జెండా పట్టుకుని సిరాజ్ అభివాదం చేస్తూ ముందుకు సాగాడు. ‘బడే మియా, హైదరాబాద్ పేస్‌గన్’ అంటూ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. డీజే సౌండ్స్, బ్యాండ్ మోత, పటాకులతో ఆ ప్రాంతమంతా సంద డి వాతావరణం నెలకొన్నది. తమ అభిమా న క్రికెటర్‌కు స్వాగతం పలికేందుకు ఫ్యాన్స్ రోడ్డుపైకి రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఒక దశలో అభిమానులను నియంత్రించేందుకు పోలీసులు లాఠీలు ఝలిపించారు. దీంతో కొంతమంది గాయపడ్డారు. భారీ సంఖ్యలో అభిమానులు రావడాన్ని అంచనా వేయలేకపోయిన పోలీసులు ముందస్తు ఏర్పాట్లలో వైఫల్యం చెందారు.