Categories: Trending now

Venkatesh Iyer | ఐపీఎల్ విజేత పెండ్లి మురిపెం.. కొత్త జంట‌ ఫొటోలు వైర‌ల్-Namasthe Telangana

2024-06-03 06:25:02

Venkatesh Iyer : ఐపీఎల్ విజేత వెంక‌టేశ్ అయ్య‌ర్ (Venkatesh Iyer) పెండ్లి చేసుకున్నాడు. కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్(KKR) ఆట‌గాడైన అయ్య‌ర్ త‌న‌ ఫియాన్సీ శృతి ర‌ఘునాథ‌న్‌ (Shruthi Raghunathan)ని భార‌తీయ సంప్ర‌దాయం ప్ర‌కారం మ‌నువాడాడు.


Venkatesh Iyer : ఐపీఎల్ విజేత వెంక‌టేశ్ అయ్య‌ర్(Venkatesh Iyer) పెండ్లి చేసుకున్నాడు. కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్(Kolkata Knight Riders) ఆట‌గాడైన అయ్య‌ర్ త‌న‌ ఫియాన్సీ శృతి ర‌ఘునాథ‌న్‌(Shruthi Raghunathan)ని భార‌తీయ సంప్ర‌దాయం ప్ర‌కారం మ‌నువాడాడు. వీళ్ల‌కు నిరుడు న‌వంబ‌ర్‌లోనే నిశ్చితార్థం జ‌రుగగా.. ఆదివారం కుటుంబ స‌భ్యులు, బంధుమిత్రుల స‌మ‌క్షంలో దాంప‌త్య జీవితంలో అడుగుపెట్టారు. ఈ ఇద్ద‌రి వివాహ తంతు అంగ‌రంగ‌ వైభవంగా సాగింది.

న‌వ వ‌ధువు శృతి నీలం రంగు చీర‌లో మెరిసిపోగా.. అయ్య‌ర్ సంప్ర‌దాయ దుస్తుల్లో సంద‌డి చేశాడు. ఈ కొత్త జంట దండ‌లు మార్చుకున్న ఫొటోలు ఆన్‌లైన్‌లో వైర‌ల్ అవుతున్నాయి. ఇప్ప‌టికే శృతి, వెంకీల పెండ్లి ఫొటోల‌ను రెండు ల‌క్ష‌ల మందికిపైగా చూశారు. క‌ర్నాట‌క‌కు చెందిన శృతి బీ.కామ్ పూర్త‌య్యాక‌ నిఫ్ట్‌(NIFT)లో ఫ్యాష‌న్ మేనేజ్‌మెంట్‌లో మాస్ట‌ర్స్ చదివింది. ప్ర‌స్తుతం ఆమె బెంగళూరులో లైఫ్‌స్ట‌యిల్ ఇంట‌ర్నేష‌న‌ల్ కంపెనీకి మ‌ర్చండైస్ ప్లాన‌ర్‌గా సేవ‌లందిస్తోంది.

ఐపీఎల్‌తో వెలుగులోకి వ‌చ్చి టీమిండియా జెర్సీ(Team India Jersey) వేసుకున్న క్రికెట‌ర్ల‌లో అయ్య‌ర్ ఒక‌డు. 2021 సీజ‌న్‌లో ఈ లెఫ్ట్ హ్యాండ‌ర్ రెచ్చిపోయి ఆడాడు. 10 మ్యాచుల్లో 41.11 స‌గ‌టుతో 370 ప‌రుగులు చేసి భార‌త సెలెక్ట‌ర్ల దృష్టిలో ప‌డ్డాడు. ఆల్‌రౌండ‌ర్‌గానూ అద‌రగొట్టే అయ్య‌ర్ ఇప్ప‌టివ‌ర‌కూ భార‌త జ‌ట్టు త‌ర‌ఫున 9 టీ20లు, 2 వ‌న్డేలు ఆడాడు.

ఆ త‌ర్వాత జ‌ట్టులో చోటు కోల్పోయిన వెంకీ.. ప‌దిహేడో సీజ‌న్‌లో చిత‌క్కొట్టాడు. మిడిలార్డ‌ర్‌లో కోల్‌క‌తా ఇన్నింగ్స్‌కు వెన్నెముక‌లా నిలిచాడు. 14 మ్యాచుల్లో 158 స్ట్రయిక్ రేటుతో 370 ర‌న్స్ కొట్టాడు. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌ (Sunrisers Hyderabad)తో జ‌రిగిన ఫైన‌ల్లో అయ్య‌ర్ మెర‌పు హాఫ్ సెంచ‌రీతో కోల్‌క‌తాను గెలిపించాడు.

News Today

Recent Posts

Here’s how far mortgage rates have dropped already this year

2024-09-20 08:15:03 Mortgage rates are a lot lower today than they were at the start…

4 mins ago

Adoption fraud separated generations of South Korean children from their families, AP finds

SEOUL, South Korea -- South Korea’s government, Western countries and adoption agencies worked in tandem…

9 mins ago

Quién fue Emerson Romero, el cineasta que honra Google con un Doodle este 19 de septiembre

2024-09-20 08:05:03 Durante el Mes de la Herencia Hispana, Google ha decidido utilizar sus Doodle…

14 mins ago

State Department opens online passport renewal service to full public

2024-09-20 07:55:03 The days where the only option to renew your passport was mailing the…

24 mins ago

Dow, S&P 500 close at record highs, Nasdaq surges amid rate cut euphoria

2024-09-20 07:45:02 US stocks soared, with the Dow Jones Industrial Average (^DJI) closing above the…

34 mins ago

ICYMI – Peter Barca, Angelina Cruz, and concerned constituent speak out on Bryan Steil’s extreme record on abortion and IVF – WisPolitics

2024-09-20 07:35:02 MADISON, Wis. — Today, Peter Barca, State Assembly candidate Angelina Cruz, and a concerned constituent…

44 mins ago