2024-07-01 10:10:01
టీ20 వరల్డ్‌కప్ 2024 ముగిసిన రెండు రోజుల్లోనే మరో క్రికెట్ ఫెస్టివల్ మొదలు కానుంది. నేటి నుంచి (జులై 1) శ్రీలంకలో జరిగే లంక ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానుంది. ఈ లీగ్‌లో శ్రీలంక ఆటగాళ్లతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలా మంది స్టార్ ఆటగాళ్లు పాల్గొననున్నారు. ఈ లీగ్‌లో మొత్తం ఐదు జట్లు (బి-లవ్ క్యాండీ, కొలొంబో స్ట్రయికర్స్, డంబుల్లా సిక్సర్స్, గాలే మార్వెల్స్, జాఫ్నా కింగ్స్) పోటీపడనున్నాయి. 21 రోజుల పాటు జరుగనున్న ఈ లీగ్ జులై 21న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. ఈ లీగ్‌లో మ్యాచ్‌లు మధ్యాహ్నం 3 గంటలకు, రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి.
జట్ల వివరాలు..
బి-లవ్ క్యాండీ: ఆషేన్ బండార, పవన్ రత్నాయకే, దిముత్ కరుణరత్నే, అఘా సల్మాన్, చతురంగ డిసిల్వ, ఏంజెలో మాథ్యూస్, కమిందు మెండిస్, దసున్ షనక, వనిందు హసరంగ (కెప్టెన్), రమేశ్ మెండిస్, దినేశ్ చండీమల్, ఆండ్రీ ఫ్లెచర్, మొహమ్మద్ హరీస్, షమ్ము అషన్, దుష్మంత చమీర, మొహమ్మద్ హస్నైన్, కసున్ రజిత, లక్షన్సందకన్, చమత్ గోమెజ్, మొహమ్మద్ అలీ, కవిందు పతిరత్నే
కొలొంబో స్ట్రయికర్స్: కవిన్ బండార, ముహమ్మద్ వసీం, గ్లెన్ ఫిలిప్స్, షెవాన్ డేనియల్, నిపున్ ధనుంజయ, షెహాన్ ఫెర్నాండో, తిసార పెరీరా (కెప్టెన్), దునిత్ వెల్లలగే, ఏంజెలో పెరీరా, చమిక కరుణరత్నే, షాదాబ్ ఖాన్, రహ్మానుల్లా గుర్బాజ్, సదీర సమరవిక్రమ, బినుర ఫెర్నాండో, అల్లా ఘజన్ఫర్, చమిక గుణశేఖర, మతీశ పతిరణ, గరుక సంకేత్, తస్కిన్ అహ్మద్, ఇసిత విజేసుందర
డంబుల్లా స్ట్రయికర్స్: నవిందు ఫెర్నాండో, రీజా హెండ్రిక్స్, తౌహిద్ హ్రిదోయ్, చమిందు విక్రమ సింఘే, దనుష్క గుణతిలక, లహిరు మధుషంక, అషంక మనోజ్, మార్క్ చాప్మన్, ఇబ్రహీం జద్రాన్, సోనల్ దినుష, దుషన్ హేమంత, మొహమ్మద్ నబీ (కెప్టెన్), నిమేశ్ విముక్తి, రనేశ్ సిల్వ, లహీరు ఉడార, కుశాల్ పెరీరా, నువాన్ ప్రదీప్, ప్రవీణ్ జయవిక్రమ, దిల్షన్ మధుషంక, ముస్తాఫిజుర్ రెహ్మాన్, నువాన్ తుషార, సచిత జయతిలక, అఖిల ధనంజయ
గాలే మార్వెల్స్: లసిత్ క్రూస్పుల్లే, పసిందు సూరియబండార, సదిష రాజపక్సే, సహాన్ అరచ్చిగే, జనిత్ లియనగే, ధనంజయ లక్షన్, డ్వెయిన్ ప్రిటోరియస్, సీన్ విలియమ్స్, కవిందు నదీషన్, అలెక్స్ హేల్స్, ఇసురు ఉడాన, నిరోషన్ డిక్వెల్లా (కెప్టెన్), భానుక రాజపక్స, టిమ్ సీఫర్ట్, మల్షా తరుపతి, చమిందు విజేసింఘే, లహీరు కుమార, ప్రభాత్ జయసూర్య, ముజీబ్ రెహ్మాన్, జాఫ్రే వాండర్సే, మొహమ్మద్ షిరాజ్, జహూర్ ఖాన్
జాఫ్నా కింగ్స్: అవిష్క ఫెర్నాండో, అలెక్స్ రాస్, అహాన్ విక్రమసింఘే, ఫేబియన్ అలెన్, ధణంజయ డిసిల్వ, చరిత్ అసలంక (కెప్టెన్), ఎషాన్ మలింగ, పథుమ్ నిస్సంక, రిలీ రొస్సో, అజ్మతుల్లా ఒమర్జాయ్, విషద్ రండిక, నిషన్ మధుష్క, కుశాల్ మెండిస్, వనుజ సహాన్, లహీరు సమరకూన్, జేసన్ బెహ్రాన్‌డార్ఫ్, అషిత్ ఫెర్నాండో, నిసల తారక, నూర్ అహ్మద్, ప్రమోద్ మధుషన్, తీసన్ వితుషన్, విజయ్‌కాంత్ వియాస్కాంత్, ముర్విన్ అభినాశ్, అరుల్ ప్రగాసమ్