2024-07-06 21:40:01
Khaleel Ahmed : ఐపీఎల్లో నిలకడగా రాణించిన సీనియర్ బౌలర్ ఖలీల్ అహ్మద్(Khaleel Ahmed) ఊహించని రికార్డు సాధించాడు. సుదీర్ఘ విరామం తర్వాత ‘బ్లూ జెర్సీ’ వేసుకున్న ఇండియన్ క్రికెటర్‌గా ఖలీల్ పుస్తకాల్లోకెక్కాడు.
Khaleel Ahmed : ఐపీఎల్లో నిలకడగా రాణించిన సీనియర్ బౌలర్ ఖలీల్ అహ్మద్(Khaleel Ahmed) ఊహించని రికార్డు సాధించాడు. సుదీర్ఘ విరామం తర్వాత ‘బ్లూ జెర్సీ’ వేసుకున్న ఇండియన్ క్రికెటర్‌గా ఖలీల్ పుస్తకాల్లోకెక్కాడు. జింబాబ్వే పర్యటన (Zimbabwe Tour)కు ఎంపికైన ఈ స్పీడ్‌స్టర్.. హరారేలో తొలి టీ20 మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. దాంతో, మళ్లీ పొట్టి ఫార్మాట్లో ఆడాలనుకున్న అతడి కల సాకారమైంది. అంతేకాదు
లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అయిన ఖలీల్ సుదీర్ఘ విరామం అనంతరం టీ20 జట్టులోకి వచ్చాడు. 1,699 రోజుల తర్వాత అంటే.. దాదాపు ఐదేండ్ల తర్వాత ఈ పేసర్ దేశం తరఫున తొలి టీ20 ఆడాడు. ఖలీల్ చివరిసారిగా 2019 నవంబర్ 10న టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ మధ్యకాలంలో భారత జట్టు 103 టీ20 మ్యాచ్‌లు ఆడడం గమనార్హం. దాంతో, రెండు సార్లు ఆడడానికి మధ్య ఎక్కువ రోజులు తీసుకున్న ఆటగాడిగా ఖలీల్ చరిత్రపుటల్లో పేరు సంపాదించాడు.
రిజర్వ్ ప్లేయర్‌గా..
ఐపీఎల్ 17వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఇరగదీసిన ఖలీల్.. టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్‌కు ఎంపికయ్యాడు. అయితే రిజర్వ్ ప్లేయర్‌గా టీమిండియాతో అమెరికా, వెస్టిండీస్‌లకు వెళ్లాడు. కానీ, మెగా టోర్నీలో ఈ వెటరన్ పేసర్‌కు అతడికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే చాన్స్ రాలేదు. దాంతో, బెంచ్‌కే పరిమితమైనా రోహిత్ శర్మ బృందంతో పాటు వరల్డ్ కప్ హీరో ట్యాగ్ సొంతం చేసుకున్నాడు.