2024-07-01 22:30:02
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను upsc.gov.inలో చెక్ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా జూన్ 16న ఈ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కులు, కటాప్ మార్కులు, ఆన్షర్ కీ వెబ్సైట్లో అప్లోడ్ చేయనున్నట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలను కూడా ఇప్పటికే విడుదల చేశారు. యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ 2024 పరీక్షలను రెండు షిఫ్టుల్లో నిర్వహించారు. జనరల్ స్టడీస్ పేపర్-1, పేపర్-2 లకు కలిపి మొత్తం 200 మార్కులకు పరీక్ష జరిగింది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్స్ రాయాల్సి ఉంటుంది. రెండు షిఫ్టులలో 13.4 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.